అసంపూర్తి జాతీయ రహదారి పనులతో కలిగిరిలో నిత్యం ప్రమాదాలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కలిగిరి
కలిగిరిలో జాతీయరహదారి 167బీజీ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారుల సమన్వయ లోపం, భూసేకరణ పూర్తికాకపోవడంతో పనులు నిలిచాయని స్థానికులు వాపోతున్నారు. పెట్రోలు బంకు మలుపు వద్ద గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గతంలో పనులను పరిశీలించి కొలతల మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం.