ఎన్నికల కమిషనర్లను అరెస్ట్ చేయాలంటూ మమతా బెనర్జీ ఫైర్
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: Kolkata
ఎన్డీయే సర్కార్పై పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన వ్యవహారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత కుంభకోణకరమైన కథనమని, జీవితంలో ఎన్నడూ ఇలాంటిది చూడలేదన్నారు. బాధ్యులైన ఎన్నికల కమిషనర్లను వెంటనే అరెస్ట్ చేయాలని, వారికి ఎలాంటి నైతిక హక్కు లేదని మమతా బెనర్జీ ఘాటుగా డిమాండ్ చేశారు.