నిబంధనలకు విరుద్ధంగా డీజే ఏర్పాటుపై యజమానిపై కేసు నమోదు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందిన ముల్కల్ల సంజీవ్ నిబంధనలకు విరుద్ధంగా ఓ కార్యక్రమంలో డీజే పెట్టినందుగాను కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ గురువారం తెలిపారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని ఏపీ 01 డబ్ల్యూ 2860 నంబరు గల టాటా ఏసీ వాహనంలోని డీజే సిస్టమ్ను సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.