డైవర్షన్ రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

ప్రతిసారీ దొరికిపోయినప్పుడు డైవర్షన్ రాజకీయాలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. సమాధానం చెప్పే ధైర్యం లేక దొడ్డిదారిన ప్రజల ఆలోచనలను మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించింది. ప్రజలకి అన్ని వాస్తవాలు తెలుస్తున్నాయని, ఇకపై ఆయన ఆటలు సాగవని హెచ్చరిస్తూ సోషల్ మీడియా వేదికగా మండిపడింది.