వైకాపా హయాంలో మూడు వేల కోట్ల మద్యం కుంభకోణంపై జగన్ సమాధానం చెప్పాలి

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాసిరకం, కల్తీ మద్యం అమ్మకాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని, ఏలూరు జిల్లాలో కల్తీ మద్యం తాగి ప్రజలు బలైపోవడానికి జగనే కారణమని ఆరోపించారు.