'తిరుమల పవిత్రతను కాపాడుతాం': టీటీడీపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

రిపోర్టర్: శివ స్థలం: Amaravati

తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, తిరుమల పవిత్రతను పరిరక్షించడంతో పాటు భక్తులకు మరింత మెరుగైన వసతులు, పారదర్శక సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.