తెలంగాణలో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో రానున్న అక్టోబర్ నాలుగు మరియు ఐదు తేదీల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా ఎండల తీవ్రత పెరిగినప్పటికీ, రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.