కృత్రిమ మేధస్సు మానవాళికి పెను ముప్పంటూ ఆంత్రోపిక్ రిసర్చర్ జేకబ్ కాక్సన్ రాజీనామా

రిపోర్టర్: రాము స్థలం: World

కృత్రిమ మేధస్సు టెక్నాలజీ కారణంగా ఈ దశాబ్దం ముగిసేలోగా మానవాళికి అంతరించిపోయే ముప్పు పొంచివుందంటూ ఆంత్రోపిక్ సంస్థ రీసెర్చర్ జేకబ్ కాక్సన్ సంచలన ప్రకటన చేస్తూ తన పదవికి రాజీనామా చేశారు. సిలికాన్ వ్యాలీతో పాటు వాషింగ్టన్, బీజింగ్ దేశాలను కలవరపెడుతున్న ఈ పరిణామంపై ఆయన మాట్లాడుతూ ఏఐ సంస్థలు మానవులను మించిన మేధస్సును సృష్టించేందుకు పోటీ పడుతున్నాయని, భవిష్యత్తులో ఇది మానవజాతి మనుగడకే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు.