పండగ సీజన్లో సరికొత్త మోటార్సైకిళ్లను ఆవిష్కరించిన క్లాసిక్ లెజెండ్స్

రిపోర్టర్: నరేష్ స్థలం: ముంబై

భారతీయ పండగ సీజన్ వేడుకల్లో భాగంగా జావా, యెజ్డీ మరియు బీఎస్ఏ బ్రాండ్ల శ్రేణిలో సరికొత్త అప్డేట్లను మోటార్సైకిల్ తయారీ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ ప్రకటించింది. ముంబై వేదికగా ఆవిష్కరించిన ఈ కొత్త మోడళ్ల ద్వారా రైడర్లకు ఆధునిక సాంకేతికతతో కూడిన మెరుగైన ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు అనుపమ్ థరేజ స్పష్టం చేశారు. తమ మోటార్సైకిళ్ల అసలైన ప్రామాణికతను నిలబెట్టడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.