తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని చాటిన నాయకులు

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలోని గిరిప్రసాద్ గారి విగ్రహం వద్ద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు నిర్వహించే ఈ వేడుకల్లో సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతు రావు పాల్గొని మాట్లాడారు. భూమి, భుక్తి, విముక్తి కోసం నాటి రైతాంగం సాగించిన వీరోచిత పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని తెలిపారు. పేదలు, రైతులు మరియు కూలీల హక్కుల కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాట స్ఫూర్తిని నేటి యువతకు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.