పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఎస్పీ మాధవ్ రెడ్డి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: పార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమంలో ఎస్వీ మాధవ్ రెడ్డి సిబ్బంది విజ్ఞాపనలు స్వీకరించారు. నిత్యం ప్రజాసేవలో ఉండే పోలీసుల శాఖాపరమైన మరియు ఆరోగ్యపరమైన సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొని తమ వ్యక్తిగత, వృత్తిపరమైన ఇబ్బధులను ఎస్పీకి నేరుగా విన్నవించుకున్నారు.