పొదలకూరు ఎన్నికల్లో వైఎస్సార్సీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని సురేష్ కుమార్ రెడ్డి పిలుపు
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జడ్పీటీసీ అభ్యర్థి బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి ప్రజలను కోరారు. బుధవారం ఎమ్మార్వో కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.