'మునుగోడు అభివృద్ధికి నిధులు సాధించాలి': డా. చిలకల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండల కేంద్రంలో బీసీవై పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు డా. చిలకల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ లేదా నిధుల మంజూరు జీఓను అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు సాధించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కోరారు. పారిశ్రామిక కాలుష్యం, డిండి ప్రాజెక్టు, 22-ఏ భూములు, వైద్య, రైతు సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండీ జావేద్, సర్వేలు శ్రీనివాస్, అడెపు బిక్షపతి, మారుతి వికాస్ యాదవ్ తదితరులు పాల్గొని ప్రజా సమస్యలపై మాట్లాడారు.