గణేష్ ఉత్సవాల్లో నిషేధాన్ని ధిక్కరిస్తే కఠిన చర్యలు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా మందమర్రిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపులను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. స్థానిక DJ, సౌండ్ సిస్టమ్ ఆపరేటర్లతో SI నరేష్ ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించి, ఉత్సవాల్లో DJల వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పరికరాలు సీజ్ చేయడంతోపాటు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆపరేటర్లను బైండ్ఓవర్ చేశారు.