దాచేపల్లిలో వైయస్ఆర్ సీపీ చైర్మన్ అభ్యర్థి కొప్పుల రవి అన్యాయంగా అరెస్ట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Dachepalli

దాచేపల్లి నగర పంచాయతీ వైయస్ఆర్ సీపీ చైర్మన్ అభ్యర్థి కొప్పుల రవిని పోలీసులు తప్పుడు కేసులో అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రవి ఇంటి పార్కింగ్లో పోలీసులే మద్యం సీసాలు ఉంచి అరెస్టు చేయడం అత్యంత దారుణమని, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారనే విషయంపై కూడా స్పష్టత ఇవ్వడం లేదని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా సాగుతున్న ఈ అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు.