'ఐదు నిమిషాల కాల్‌తో ఉద్యోగాలు ఊడగొట్టారు': అమెరికా సంస్థపై ఉద్యోగుల ఆవేదన
రిపోర్టర్: సునీల్
స్థలం: భారతదేశం
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ భారత్‌లోని తమ కస్టమర్ సర్వీస్ విభాగానికి చెందిన 80 మంది ఉద్యోగులను కేవలం ఐదు నిమిషాల గూగుల్ మీట్ కాల్‌లో తొలగిస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. సడన్‌గా ఉద్యోగాలు కోల్పోవడంతో తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని, కార్పొరేట్ సంస్థల తీరు దారుణంగా ఉందని బాధిత ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు.