ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.79 కోట్ల రాయితీ భూములు
రిపోర్టర్: రాము
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పరిశ్రమల ఏర్పాటు కోసం రాయితీ ధరకు భూములు కేటాయించడం ద్వారా వారికి రూ.79 కోట్ల లబ్ధి చేకూరుస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు 3,246 ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు ఏపీఐఐసీ ద్వారా భూములు కేటాయించారు. దీనివల్ల రూ.9,162 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి లభించనుంది.