దిల్లీలో మైనర్ బాలికపై అత్యాచారం నిందితుడితో పోలీసుల ఎదురుకాల్పులు

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

దిల్లీలోని అమర్‌ కాలనీలో మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన ఆసిఫ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసే క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులపైకి కాల్పులు జరపడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ ధరించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌కు బుల్లెట్‌ తగిలింది. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడి కుడి కాలికకు గాయమవడంతో అతడిని చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌ ట్రామా సెంటర్‌కు తరలించారు.