వైకాపా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఈడీ కస్టడీకి
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా వైకాపా నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయన్ను సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మద్యం రవాణా ద్వారా రూ.కోట్లు కొల్లగొట్టి దారి మళ్లించారన్న ఆరోపణలపై ఈడీ ఈ చర్యలు చేపట్టింది.