ఎల్నినో దెబ్బకు పశుగ్రాస కొరతతో అల్లాడుతున్న పాడి రైతులు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: సంగం

సంగం ప్రాంతంలో ఎల్నినో ప్రభావంతో మూగజీవాలకు పశుగ్రాసం దొరకడం కష్టతరంగా మారి పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా పశువైద్యశాఖ అధికారి రమేష్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, యంత్రాల ద్వారా వరి కోతలు జరగడం, వర్షాలకు గడ్డి తడవడంతో ఎండుగడ్డి లభ్యత తగ్గింది. ఈ సమస్యపై ప్రభుత్వానికి నివేదికలు పంపించామని, 50 శాతం రాయితీతో దాణా సరఫరా చేయడంతో పాటు పంచాయతీల్లో నీటితొట్టెలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.