సూరి నటించిన 'మందాడి' సినిమాను ప్రశంసించిన సూపర్ స్టార్ రజనీకాంత్

రిపోర్టర్: కృష్ణ స్థలం: తమిళనాడు

సూరి హీరోగా నటించిన తాజా చిత్రం 'మందాడి'కి సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి ప్రశంసలు దక్కాయి. సినిమా చూసిన రజనీకాంత్ స్వయంగా ఫోన్ చేసి సూరి నటనను అభినందించారు. ఈ ఫోన్ కాల్ తన జీవితంలో మరువలేని క్షణమని, ఆయన మాటలు తనకు దక్కిన గొప్ప ఆశీర్వాదమని సూరి సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. సముద్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.