విజయ్ నిరాడంబరత తనను ఆశ్చర్యపరిచిందన్న నటుడు విజయ్ సేతుపతి
రిపోర్టర్: మహేష్
స్థలం: తమిళనాడు
తమిళనాడు ప్రముఖ నటుడు విజయ్‌తో తనకున్న అనుబంధం గురించి నటుడు విజయ్ సేతుపతి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ జన్మదినం సందర్భంగా తాను శుభాకాంక్షలు తెలియజేయగా, ఊహించని విధంగా విజయ్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. అగ్ర నటుడైనప్పటికీ స్వయంగా ఫోన్ చేసి ప్రియ మిత్రమా అంటూ మాట్లాడడం తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసిందని విజయ్ సేతుపతి తెలిపారు.