యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించి భవిష్యత్తును కాపాడుకోవాలని ట్రాఫిక్ సీఐ రాము సూచన
రిపోర్టర్: సునీల్
స్థలం: అయ్యన్నపేట
అయ్యన్నపేట నగరంలోని చైతన్య డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులకు రహదారి భద్రతపై ట్రాఫిక్ సీఐ ఎస్.రాము అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని ఆయన సూచించారు. చాలా ప్రమాదాలు మైనర్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ వల్ల జరుగుతున్నాయని తెలిపారు. యువత గంజాయి, మాదక ద్రవ్యాలు, బెట్టింగ్ యాప్లు వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉన్నత లక్ష్యాల సాధన కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.