నెల్లూరు జిల్లాలో అక్రమ మద్యం విక్రేతల అరెస్టు

రిపోర్టర్: విజయ్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా జలదంకి మండలం గోపనపాలెంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 17 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ వెంకటరావు వెల్లడించారు. అక్రమ మద్యం రవాణా, విక్రయాలపై నిఘా పెంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.