తుఫాన్ల బీభత్సం: ఏపీని ఆదుకోవాలని అమిత్ షాను కోరిన చంద్రబాబు
రిపోర్టర్: సురేష్
స్థలం: Amaravati
వరుస తుఫాన్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారని అధికారులు తెలిపారు. అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో రాష్ట్రంలో జరిగిన పంట, ఆస్తి నష్టంపై కేంద్ర మంత్రికి లేఖ రాసినట్లు వెల్లడించారు. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరించినట్లు తెలిపారు.