ఢిల్లీలో కోటి రూపాయల విలువైన దొంగతనం కేసు చేధించిన పోలీసులు

రిపోర్టర్: రాము స్థలం: ఢిల్లీ

భారీ చోరీకి పాల్పడి నేపాల్‌కు పారిపోవాలని భావించిన ఇద్దరు గృహ కార్మికులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నార్త్ ఢిల్లీలోని మాల్ రోడ్‌లో ఉన్న ఓ ఇంట్లో యజమానులు విదేశాలకు వెళ్లిన సమయం చూసి సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన 117 బంగారు, డైమండ్ ఆభరణాలతో పాటు నాలుగు లక్షలకు పైగా నగదును దొంగిలించారు. సీసీటీవీ టేజ్‌ల ఆధారంగా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో గాలించి నిందితులను పట్టుకుని సొత్తును స్వాధీనం చేసుకున్నారు.