వేలంకలో పోలీసుల అవగాహన: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని డీఎస్పీ పిలుపు

రిపోర్టర్: U.Srinivasarao స్థలం: కిర్లంపూడి

కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో శుక్రవారం ఎన్నికలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. పెద్దాపురం డీఎస్పీ తిలక్, సీఐ తిరుపతిరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆపరేషన్ త్రిశూల్లో భాగంగా గంజాయికి దూరంగా ఉండాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మహిళల భద్రతపై పలు కీలక సూచనలు చేస్తూ పోలీసు అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.