సాగునీటి శాఖ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు ఏపీ హైకోర్టుకు బదిలీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: దిల్లీ

ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి శాఖ ఇంజినీర్ల సీనియారిటీ వివాదానికి సంబంధించి ఏపీ ఉద్యోగులు దాఖలుచేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్‌ ఎంఎం సుందరేష్, జస్టిస్‌ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఉద్యోగుల వివాదాలను అక్కడి హైకోర్టులోనే విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.