పెద్దమిట్టపల్లి అనాథ ఆశ్రమంలో అన్నదానంతో అండగా నిలిచిన నిర్వాహకులు

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీ ఆనంద నిలయ అనాథ ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం, యోగా మరియు ధ్యాన కార్యక్రమాలను నిర్వహించారు. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని భోజనాలు వడ్డించారు. ప్రతి శనివారం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.