ఉద్యోగుల నిఘాపై మెటా సంస్థకు వ్యతిరేకంగా భారీ తిరుగుబాటు
రిపోర్టర్: సురేష్
స్థలం: World
కృత్రిమ మేధస్సు శిక్షణ కోసం ఉద్యోగుల కంప్యూటర్ కార్యకలాపాలను రహస్యంగా సేకరించాలని మెటా సంస్థ భావించింది. దీనికోసం మోడల్ కేపబిలిటీ ఇనిషియేటివ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. అయితే పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారం లీకవుతుందనే భయంతో 1,800 మందికి పైగా ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. మీమ్స్, పిటిషన్లతో ఆందోళనలు చేపట్టడంతో ఈ డేటా సేకరణ కార్యక్రమం తీవ్ర వివాదాస్పదమైంది.