కంటి చూపులో తెరలాంటి నీడ కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

కంటి చూపులో ఆకస్మికంగా తెరలాంటి నల్లటి నీడ లేదా మచ్చ కనిపిస్తే అది రెటినా సంబంధిత సమస్యకు హెచ్చరిక కావచ్చునని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ అఖిలేష్ యాదవ్ తెలిపారు. ప్రపంచ రెటినా దినోత్సవం సందర్భంగా కంటి ఆరోగ్య పరిరక్షణపై ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య చికిత్స తీసుకోవాలని, లేకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.