నెల్లూరులో రూ.55 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం

రిపోర్టర్: రాజేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఖాజానగర్లో పదిహేను లక్షల రూపాయలతో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం జిమ్ పార్కును ప్రారంభించారు. అలాగే జొన్నవాడ గ్రామంలో పదిహేను లక్షల రూపాయలతో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఎంపీ నిధులతో ఇరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన హిందూ స్మశాన వాటిక శుభస్వీకరణ భవనాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించినట్లు వెల్లడించారు.