వివేకా హత్య కేసు: నిందితులకు ఎదురుదెబ్బ!
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్, తెలంగాణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు నాంపల్లి సీబీఐ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ3 ఉమాశంకర్‌రెడ్డి, ఏ6 గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయస్థానం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. నిందితులపై అభియోగాలు విచారించదగినవేనని స్పష్టం చేసింది. దీంతో నిందితులు పూర్తిస్థాయి ట్రయల్‌ను ఎదుర్కోవాల్సిందే. విచారణ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది.