మార్కెట్లోకి త్వరలో వివో Y600i సిరీస్ స్మార్ట్‌ఫోన్

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

మార్కెట్లోకి త్వరలో కొత్త వివో Y600i సిరీస్ స్మార్ట్‌ఫోన్ రానుంది. వివో Y600i, వివో Y600i ఏఐ ఎడిషన్లుగా ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి. చైనా 3సీ సర్టిఫికేషన్ పొందిన ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది. గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌లోనూ ఈ డివైజ్ కనిపించింది. త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.