మున్సిపల్ కౌంటింగ్ పకడ్బందీగా చేపట్టాలి: విజయనగరం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై సోమవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ కేంద్రాల్ లో వీడియో రికార్డింగ్ తో పాటు నిబంధనల ప్రకారం చెల్లుబాటయ్యే ఓట్లను జాగ్రత్తగా పరిశీలించాలని స్పష్టం చేశారు.