నాలుగు దశాబ్దాల పీటీ ఉష రికార్డును బద్దలు కొట్టిన విత్య రామ్రాజ్
రిపోర్టర్: సురేష్
స్థలం: బెంగళూరు
నాలుగు దశాబ్దాలుగా అజేయంగా నిలిచిన పీటీ ఉష రికార్డును అథ్లెట్ విత్య రామ్రాజ్ బద్దలు కొట్టారని నిపుణులు తెలిపారు. 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో పీటీ ఉష 400 మీటర్ల హర్ల్స్లో నెలకొల్పిన 55.42 సెకన్ల జాతీయ రికార్డును కోయంబత్తూర్కు చెందిన విత్య రామ్రాజ్ తాజాగా అధిగమించారని వారు పేర్కొన్నారు. ఈ ఈవెంట్ అత్యంత టెక్నికల్ కావడంతో పాటు సరైన ప్రత్యామ్నాయ క్రీడాకారులు లేకపోవడం వల్లే ఇన్నాళ్లు ఈ రికార్డు అలాగే ఉండిపోయిందని కోచ్ పీబీ జైకుమార్ వెల్లడించారు.