నేడే నర్సింగోలులో సీఎం చంద్రబాబు పర్యటన: రైతులకు రాజముద్ర పాస్‌పుస్తకాల పంపిణీ
రిపోర్టర్: సురేష్
స్థలం: ప్రకాశం
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలులో శుక్రవారం జరగనున్న 'మీభూమి-మీహక్కు' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొని రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రీ సర్వే ద్వారా భూ సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో సీఎం పర్యటనకు జిల్లా యంత్రాంగం పటిష్ఠమైన ఏర్పాట్లు చేసింది. నర్సింగోలులో రైతులతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం కొండపి నియోజకవర్గ తెదేపా శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.