ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల నిబంధనలపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ
రిపోర్టర్: రమేష్
స్థలం: New Delhi
ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల పునర్విభజనలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటు లేదా అసెంబ్లీ నియోజకవర్గాల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా శాసనసభల పరిధిలోకి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని లక్ష్మణ రేఖను దాటలేమని, తాము పార్లమెంటుకు మూడో సభలా వ్యవహరించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ లోని కదిపూర్ నియోజకవర్గ రిజర్వేషన్ సవాలు పిటిషన్ ను విచారించేందుకు ఉన్నత ధర్మాసనం నిరాకరించింది.