యాదాద్రి ప్లాంట్ నిర్మాణంపై గత పాలకుల తప్పిదాల గుట్టురట్టు: డిప్యూటీ సీఎం భట్టి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఖమ్మం
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలో గత పాలకులు చేసిన తప్పుల కారణంగానే ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరిగి రాష్ట్ర ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సరైన ప్రణాళిక లేకుండా, బొగ్గు లింకేజీ మరియు అవసరమైన జి నైన్ గ్రేడ్ బొగ్గు అందుబాటులో లేకున్నా ప్లాంట్ నిర్మాణం చేపట్టారని ఆయన ఖమ్మంలో పేర్కొంటూ గత పాలకుల వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు.