కోస్తా రాయలసీమ ప్రయాణికులకు మచిలీపట్నం కర్నూలు ఎక్స్ప్రెస్ శుభవార్త
రిపోర్టర్: హరి
స్థలం: విజయవాడ
దక్షిణ తీర రైల్వే నూతనంగా మచిలీపట్నం కర్నూలు ఎక్స్ప్రెస్ రైలు సేవలను ప్రారంభించాలని నిర్ణయించిందని అధికారులు తెలిపారు. ఈ ట్రై-వీక్లీ ఎక్స్ప్రెస్ ద్వారా కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రయాణ సౌలభ్యం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. మొత్తం 499 కిలోమీటర్ల దూరం సాగే ఈ రైలు విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తుందని వెల్లడించారు. అలాగే దసరా, దీపావళి పండగల రద్దడిని తగ్గించేందుకు అదనపు ప్రత్యేక రైళ్లను కూడా నడపనున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.