తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోహన్ బాబు మరియు మంచు విష్ణు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తిరుమల
ప్రముఖ నటుడు డాక్టర్ మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని వేడుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వదాలు అందజేశారు.