విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ రక్త నిధి కేంద్రాన్ని ప్రారంభించిన చంద్రబాబు
రిపోర్టర్: హరి
స్థలం: విజయవాడ
విజయవాడలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రక్త నిధి కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ సేవలను ఆయన కొనియాడారు. రక్తం అందక ఏ ఒక్క ప్రాణమూ ప్రమాదంలో పడకూడదనే సంకల్పంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమని, మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని ఆయన ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు.