వైద్య శాఖ కొరడా: విధులకు గైర్హాజరైన డెబ్బై మంది డాక్టర్ల తొలగింపు
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్న వైద్యులపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఏడాదికిపైగా గైర్హాజరవుతున్న డెబ్బై మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను విధుల నుంచి శాశ్వతంగా తొలగించినట్లు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు వెల్లడించారు. ప్రజారోగ్యం దృష్ట్యా గైర్హాజరీల విషయంలో ఎలాంటి ఉపేక్ష వహించవద్దని, ఖాళీలను జీరో వేకెన్సీ పాలసీ కింద వెంటనే భర్తీ చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.