భారత నావికాదళం బలోపేతం: రూ. 53,866 కోట్లతో 8 యుద్ధనౌకల తయారీకి ఒప్పందం
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
భారత నావికాదళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ మంత్రిత్వ శాఖ రూ. 53,866.50 కోట్ల విలువైన భారీ ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా అత్యాధునిక హంగులతో ఎనిమిది నెక్స్ట్ జనరేషన్ కార్వెట్ యుద్ధనౌకలను దేశీయంగానే నిర్మించనున్నారు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఐదు నౌకలను, గోవా షిప్‌యార్డ్ మూడు నౌకలను నిర్మించనున్నాయి. ఈ యుద్ధనౌకలు త్వరలోనే నౌకాదళంలో చేరనున్నాయని రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి.