ఆలేరులో విద్యార్థి ర్యాలీని విజయవంతం చేయాలి: పల్లె సంతోష్ గౌడ్

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సెప్టెంబర్ 5న ఆలేరులో నిర్వహించే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు పల్లె సంతోష్ గౌడ్ కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందక విద్యార్థులు అల్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా చేపట్టే ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.