అంతర్వేది ఆలయ భూముల వేలం: జిల్లా పేరు సవరణపై ఈవో స్పష్టత
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సఖినేటిపల్లి
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల వేలం ప్రకటనలో జిల్లా పేరును పొరపాటున కోనసీమగా పేర్కొనడంపై ఈవో ప్రసాద్ స్పందించారు. అక్టోబర్ 26న ప్రచురితమైన ప్రకటనలో సాంకేతిక కారణాల వల్ల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఉండాల్సిన చోట కోనసీమ జిల్లాగా ముద్రితమైందని వివరించారు. ఈ పొరపాటును సరిదిద్దుతూ తాజాగా సవరణ ప్రకటనను విడుదల చేశామని, అంబేద్కర్ ఆశయాలకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.