రైతన్నలకు తీపి కబురు: రాజముద్రతో కొత్త పాసు పుస్తకాల పంపిణీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అందజేసినట్లు వెల్లడించారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా అన్నదాతలకు ఈ నూతన పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కీలక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా తమ భూములపై రైతులకు పూర్తి హక్కులు లభిస్తాయని స్పష్టం చేశారు.