రిమ్స్ లో చిన్నారుల మరణాలు ప్రభుత్వ హత్యలే అంటు కవిత ఆగ్రహం

రిపోర్టర్: సతీష్ స్థలం: ఆదిలాబాద్

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఏసీ పేలుడు ఘటనలో ఐదుగురు చిన్నారులు మృతి చెందడంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించిన ఆమె, ఇది ప్రభుత్వ హత్యలంటూ మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, లేదంటే ఆదిలాబాద్ ను ఘెరావ్ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.