రెడ్డిబావిలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రెడ్డిబావి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామంలో శ్రీ రెడ్డిబావి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు గ్రామ నాలుగో వార్డు సభ్యుడు ముద్దం రమేష్ యాదవ్ దంపతులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.