మధుయాష్కి గౌడ్ కు ఘనంగా అభినందనలు తెలిపిన శ్రీనివాస్ గౌడ్

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్ పర్సన్ గా నియమితులైన మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. విభిన్న రంగాల నిపుణులను సమన్వయం చేసే సత్తా ఆయనకు ఉందని శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా కొనియాడారు.